నెల్లూరు జిల్లా: డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 130 వ జయంతి సందర్బంగా ఉపకులతి రొక్కం సుదర్సన రావు గారు ఘనంగా నివాళి అర్పించారు. రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య మరియు రిజిస్టర్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు విశ్వవిద్యాలయ సెమినార్ హాల్ లో చిత్ర పటానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఉపకులతి మాట్లాడుతూ, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని తెలిపారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు అని తెలిపారు.
విశ్వవిద్యాలయం ఆన్లైన్ లో జయంతి కార్యక్రమం నిర్వహించగా ఆచార్య కె ఎస్ చల్లం ఫార్మర్ చైర్మన్ యూ పి ఎస్ ఎస్ సి గారు చెయ్ ప్రత్యేక లెక్చర్ ఇపించడమైనది. చల్లం గారు మాట్లాడుతూ బి ఆర్ అంబెడ్కర్ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూలన’, ‘మతమార్పిడి’, ‘బౌద్ధమతం’, ‘హిందూమతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కరణలు-దళితులు’, ‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. ఆ కాలం లోనే ఆర్థిక శాస్త్రం లో ప్రావిణ్యం వున్న అంబెడ్కర్ గారు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశ ఆర్థిక వ్య్వస్థ కు చేసిన కీడును దానివలన అణగారి వర్గాల పై ఎలా ప్రాభవం చూపుతున్నది అని తెలుపుతు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియుబ్రిటిష్ ప్రభుత్వ పాలసీ ల ని వెతిరేకించిన ఏకైక వేక్తిగా పేరు పొందారు. ఈ కార్యక్రమం లో అధ్యాపక అధ్యాపకేతర మరియు విద్యార్ధి విద్యార్థునులు పాలుగోన్నారు.