నెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవ పధకం యూనిట్ 2 దత్తతగ్రామైన బుజ బుజ నెల్లూరు హరిజనవాడ పరిసర ప్రాంతాలలో మూడవ రోజు స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్ లో భాగంగా మరుగు ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిసరప్రాంతాలను శుభ్రపరిచారు 70 మంది ఎన్ యస్ యస్ వాలంటీర్స్ తో కరోనా అవగాహన ర్యాలి ద్వారా అవగాహన కల్పించి మాస్క్ లను ఉచితంగా పంపిణిచేసారు. గ్రామ సచివాలయం నందు కరోనా ప్రత్యేక అవగాహన అదేవిధంగా యోగ థెరఫిస్ట్ అయిన ప్రసన్న కుమార్ గారు మాట్లాడతూ ఆయుర్వేదం – ప్రకృతి వైద్యం అంశం పై వాతము,కఫం ప్రజలకు వచ్చే సాదారణ ఆరోగ్య సమస్యలకు వైద్యశాలకు వెళ్ళే అవసరం లేకుండా తమ ఇంటి వద్దనే వైద్యం చేసుకునే చిట్కాలు తెలియజేశారు. ఈ వేసవి కాలంలోవచ్చే టైఫాయిడ్ తగ్గించటం కోసం ఎక్కువ గా చలువ చేసే పదార్ధాలు, పెసర,సగ్గుబియ్యం, బార్లి వంటి పదార్ధాల ద్వారా శరీరం చల్లపడటం మరియు రోగాల బారిన పడకుండా మనకు మనంగా ఇంటి చిట్కాలు ద్వారా శరీరాన్ని మనం కాపాడు కోవచ్చు అదేవిధంగా యోగ అనేది మన భారతీయశాస్త్రం యోగ యొక్క ప్రత్యేకతను అందులో ముఖ్యమైనటువంటి ముద్రలను,లింగముద్ర,జలముద్ర, సుఖ,శితలీ, మరియు బశ్రిక ప్రాణాయామం ఆసనాలను వేయించి వాటి యొక్క ప్రయోజనాలను తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ప్రసన్న కుమార్ గారికి శాలువతో సత్కరించారు. విశ్వవిద్యాలయ ఎన్ యస్ యస్ కార్యనిర్వాహకురలైన డా వై .విజయ గారు,ఎన్ యస్ యస్ వాలంటీర్స్,మరియు సచివాలయ సిబ్బంది, ఎన్ యస్ యస్ సిబ్బంది పాల్గొనారు.