రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన జంపాల రజిత (37) అనే మహిళకు మెదడులో రక్తం గడ్డ కట్టి చికిత్స పొందుతున్న నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన కొంత మంది యువకులు వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 11000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. కరీంనగర్ లో గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో మహిళను చేర్చి ఆ పేద కుటుంబం వారికి ఉన్న పొలం అమ్మి చికిత్స అందిస్తుండగా ఫలితం లేకపోగా తలకు ఆపేరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అందుకు గాను రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా కుటుంబ ఆర్థిక పరిస్థితి ధీనస్థాయిలో ఉందని గుర్తించిన మండల కేంద్రానికి చెందిన సేవ దృక్పథం గల ఎర్రోజు విశాల్ జ్ఞాపకర్థం వారి స్నేహితులు ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు నాగసముద్రాల బాలకృష్ణ, రెండ్ల సుమన్, సాదుల రాకేష్ ,బండారి మహేష్, పండుగ ఆనంద్, మహమ్మద్ యాసిన్, పర్స మల్లేశం, ఒగ్గు రంజిత్, చొప్పరి గురుప్రసాద్,ముంజ ప్రశాంత్, చిట్టి ప్రదీప్,ఎలుక సంపత్, సింగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నార్ల సజ్జన్, మెరుగు శ్రీకాంత్, నీలి శ్రీనివాస్, బొల్లావెని సంపత్ తదితరులు విరాళాలు అందించారు.