నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లోని పంజుగుల గ్రామంలో రైతు జంపుల సాయిలు పొలంలో ఎండాకాలం కావడంతో బాగ ఎండ, గాలికి నిప్పు రవ్వ ఎగిరి గడ్డి వాము పైన పడడంతో అక్కడ ఉన్న రెండు గడ్డి వాములు నిప్పటుకొని మంటలకు పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది.గడ్డి వాము కాలిపోవడం గమనించిన రైతు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ వచ్చే సరికి గడ్డి వాము మొత్తం కాలిపోవడంతో సుమారు 50,000/- రూ వరకు రైతుకు నష్టం వాటిళ్లడంతో రైతు లబోదిబోమంటున్నారు. అసలే ఎండాకాలం పశువులకు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా ఉన్న మొత్తం గడ్డి కాలిపోవడంతో ప్రభుత్వం నుండి ఎలాగైనా సహకారం అందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.