శశికళను కలిసిన రాములమ్మ
బీజేపీలో శశికళపై ఆహ్వానమా?
హైదరాబాద్,
టాలీవుడ్ సూపర్ స్టార్ తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి తమిళనాడు మాజీ నాయకురాలు శశికళను కలిశారు. కొద్ది నెలల క్రితమే శశికళ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చాక తమిళ రాజకీయాల్లో కీలకంగా పని చేస్తారేమో అని చాలా మంది అనుకున్నా ఆమె సైలెంట్ గా ఉన్నారు. తాజాగా విజయ శాంతి శశికళను కలవడం తో శశికళను బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నారా అనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. విజయశాంతి కి శశికళ చాలా కాలంగా తెలుసు. ఇద్దరు మధ్య మంచి పరిచయం ఉంది, అందుకే రాయబారానికి విజయశాంతి శశికళను కలిసింది అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎందుకు కలిసిందో విజయశాంతి మాత్రమే చెప్పాలదు