సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు వెల్లడి చేసారు .
- సికింద్రాబాద్-నర్సాపూర్ సువిధ ప్రత్యేక రైలు (నెంబర్: 82725) సికింద్రాబాద్ నుంచి జనవరి 10వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
- సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (రైల్‌నెం:07256) సికింద్రాబాద్ నుంచి జనవరి 12, 13వ తేదీల్లో రాత్రి 7.25గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
- సికింద్రాబాద్-నర్సాపూర్ సువిధ ప్రత్యేక రైలు(నెంబర్:82731) సికింద్రాబాద్ నుంచి జనవరి 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
- నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్:07255) నర్సాపూర్ నుంచి జనవరి 18వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
- నర్సాపూర్-సికింద్రాబాద్ సువిధ స్పెషల్ (రైల్‌నెంబర్: 82727 (నర్సాపూర్ నుంచి జనవరి 19వ తేదీ రాత్రి 8గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference