సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బీభత్సమైన వసూళ్లు రాబడుతుందని. ఇక దిల్ రాజు కూడా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికి మంచి లాభాలు తెచ్చిందని అన్నారు. మహేష్ బాబు కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచిందని అంటున్నారు. ఇక ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా సినిమాలో మరో నిమిషన్నర సీన్ యాడ్ చేస్తున్నామని.. మహేష్, రావు రమేష్ ల మధ్య ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే ఈ సీన్ చాలా బాగుంటుందని అన్నారు దర్శకుడు అనీల్ రావిపుడి. ఇక సినిమా చూసిన ఆడియెన్స్ అంతా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఇస్తున్నారని.. సినిమాలో తన డైలాగ్స్ చాలా మీంస్ రూపంలో వస్తున్నాయని, ముఖ్యంగా రమణా లోడ్ ఎత్తాలిరా అన్న డైలాగ్ మీద చాలా మీంస్ వస్తున్నాయని అన్నారు అనీల్ రావిపుడి. మొత్తానికి సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ మొత్తం సంతోషంగా ఉంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference