దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అనుమానితుల చేతులపై స్టాంపులు వేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు క్వారంటైన్‌లో ఉండకుండా పారిపోయి వేరే ప్రదేశాలకు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు చేతిపై హోం క్వారంటైన్ స్టాంపుతో తిరుగుతున్న ఓ యువకుడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అతడి చేతిపై ముంబై అధికారులు స్టాంపు వేశారు. అతడు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. అయితే, అతడు జనాల మధ్య తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇటీవల నైజీరియా, లాగోస్ నుంచి అబుదాబీ మీదుగా విమానంలో ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది.