ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు పిలుపునిచ్చారు. సెక్రటేరియట్‌లో కూల్చిన మసీదును నిర్మించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చెయ్యడానికి వస్తే అన్యాయంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. సెక్రటేరియట్‌లో మజీద్ ఏర్పాటు చేయకపోతే ప్రగతిభవన్‌లో నమాజ్ చదువుతాం అంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.