సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం దేవకపల్లి గ్రామంలో గురువారం బేగంపేటకు చెందిన జంగిటి లింగారెడ్డి తన అనుచరులతో కలిసి ఓబిసి జిల్లా మోర్చా కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో, బిజెపి రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర కిషన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు దూసుకుపోతుందని అలాగే ప్రజా సంక్షేమం కొనసాగిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని కొని ఆడారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికలలో బిజెపి పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ యువత ఆలోచిస్తుంది. కాబట్టి యువకులు పెద్ద మొత్తంలో బిజెపిలో చేరడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర నాగరాజు, బుర్ర క్రాంతి కుమార్, జంగిటి వెంకటరెడ్డి, గొడుగు సంపత్, కొరివి అమర్నాథ్, గంప లవన్ కుమార్, సంతోష్, రావుల బాల్ రెడ్డి, జంగిటి కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.