కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం మానకొండూరు నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జి గడ్డం నాగరాజు పౌరసత్వ సవరణ బిల్లు పై కరపత్రాలను విడుదల చేశారు మండలకేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద పౌరసత్వ సవరణ బిల్లు పై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను దుకాణ సముదాయాలలో పంపించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ దేశ సమగ్రత ఐక్యత కోసమే పార్లమెంటులో ఆమోదించాన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టు టిఆర్ఎస్ మజిల్స్ పార్టీల కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టు తున్నాయని విమర్శించారు అనంతరం మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ఠ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి సోమవారం బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు తో పాటు పద్మశాలి సంఘ కార్యవర్గం సభ్యులతో ఆయన పరిశీలించారు ఆలయములో నిర్మాణం పనులు వేగవంతంగా నిర్మించి ఈనెల 25 శనివారం 26 ఆదివారం 27 సోమవారం రోజుల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తేల్ల అంజయ్య, ఉపాధ్యక్షులు బూర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బూర వెంకటేశ్వర్, సలహాదారులు తేల్ల భాస్కర్, తెల్ల రవీందర్, తేల్ల సత్తయ్య, తదితరులు ఉన్నారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండ శ్రీనివాస్ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన గడ్డం నాగరాజుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన గుండా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేసిన బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు ఈకార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్,1 బూత్ అధ్యక్షుడు జాలి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు బుర్ర సత్యనారాయణ గౌడ్, గడ్డం సుమిత్ రెడ్డి, మునిగంటి సత్తయ్య,బుర్ర రామచంద్రం, చిగురు సంజీవ్,తదితరులు ఉన్నారు.