వైజాగ్ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిన వేళ, ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగగా, అందులో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయికి కార్మిక వర్గాల నుంచి నిరసన సెగ తగిలింది. విజయసాయి మాట్లాడుతున్న వేళ, సీపీఎం కార్యకర్తలు, అనుబంధ సంస్థ కార్మికులు అభ్యంతరం చెప్పారు. విశాఖ ప్లాంటును కొనసాగించే ప్రయత్నం చేద్దామని, కొన్ని సార్లు లక్ష్యం నెరవేరుతుందని, కొన్ని సార్లు నెరవేరకపోవచ్చని విజయసాయి వ్యాఖ్యానించగా, ఆయనకు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎవరికి నచ్చినా, నచ్చకున్నా తాను చెప్పేది వాస్తవమని, ఉక్కుశాఖ మంత్రితో పాటు, ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని, వారిని కలిసి మన డిమాండ్లను నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దామని విజయసాయి సర్దిచెప్పారు.