హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ఇంకా పలు చోట్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులను,క్షేత్రస్థాయి బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ అప్రమత్తం చేశారు..
