రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నిన్న వాట్స్ ఆప్ చాటింగ్ లో ఆ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు.
చాటింగ్ లో నూడ్ గా చాటింగ్ చేయమని కోరిన సాజీద్ అనే యువకుడు…ఆ తర్వాత నూడ్ చాటింగ్ ను రికార్డ్ చేశాడు. నూడ్ చాటింగ్ తో యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సాజీద్…రాజేంద్రనగర్ లోని తన స్నేహితుడి గదికి రావాలని బెదిరించాడు.
అయితే… వీడియో ఎక్కడ బయట పడుతుందోనని సాజీద్ బ్లాక్ మెయిల్ కు లొంగిన యువతి. హుటాహుటిన సాజీద్ చెప్పిన అడ్రస్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా ఆ యువతి పై అత్యాచారం చేశాడు సాజీద్. ఆ తర్వాత అతని స్నేహితులు నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలోనే. సీక్రెట్ గా 100 డయల్ చేసింది యువతి. యువతి ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. గదిలో వున్న యువతిని కాపాడి. అత్యాచారంకు పాల్పడ్డ సాజీద్ తో పాటు నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.