- రెవిన్యూ సిబ్బంది చర్యలేవి..?
- దీనికి కారణం ముడువులేన..?
అల్లూరి జిల్లా, హుకుంపేట: అధికారుల అండదండలు ఉంటే ఏదైనా చెయ్యొచ్చా ? ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి గిరిజనేతరుల బహుళ అంతస్తుల నిర్మాణం అడ్డూ అదుపు లేకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
1/70చట్టాన్ని అటకెక్కించి అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు నోరుమెదపని కథనమిది… అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో అక్రమ కట్టడాలకు అడ్డాగా మారింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురగా అక్రమంగా అధిన సంతోష్ అనే గిరిజనేతరుడు పట్టపగలే బహుళ అంతస్తుల నిర్మాణం ఎద్దేచగా చేపడుతుంటే అధికారులు మాత్రం చూసిచూడనట్టు వ్యవరిస్తున్నారు , అలాగే శివాలయం పక్కన ఈశ్వరరావు అనే గిరిజనేతరుడు ప్రభుత్వ స్థలం లో అక్రమ నిర్మాణం చేప్పట్టిన పట్టించుకోవడం లేదు . గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా అక్కడ పాగా వేస్తూ అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టరాదని నిబంధనలున్నప్పటికీ ఏజెన్సీ చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.