కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మండల పరిధిలోని మాదాపూర్, గునుకుల కొండాపూర్ గ్రామాలకు చెందిన బెల్టు షాపుల నిర్వాహకులు 11మందిని తహశీల్దార్ బిక్షపతి ముందు బైండోవర్ చేసినట్లు ఏస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు