మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి రేగుంట చంద్రశేఖర్ నేతృత్వంలో 13 వ కాసిపేట మండలంలో ఆదివారం ప్రజా పోరు యాత్ర ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ఎస్సి డబ్ల్యు, యు ప్రదాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ,,
డాక్టర్ బి అర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిప్రజా పోరు యాత్ర ప్రారంభిచారు. ప్రజాపోరు యాత్రకు నియోజకవర్గ కార్యదర్శి ప్రజా పోరు యాత్ర ,దళసభ్యులు దాగం మల్లేష్ , దాడి గట్టయ్య ,జాడి పోశం ,దుర్గం సుదాకర్ , ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర కొనసాగుతుందనీ అన్నారు
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ఎస్సి,డబ్ల్యు, యు ప్రదాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఐ చేస్తున్న ప్రజా పోరు యాత్రను ప్రజలు ఆదరించాలని కోరారు దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మరియు సింగరేణి ప్రయివేటీకరణ చేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రాష్ట్ర సమితి సభ్యులు
బొల్లం పూర్ణిమ, మేకల దాస్ ,జొగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం, లింగం రవి ,మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, సాలిగామ సంతోష్,బొంతల లక్ష్మీనారాయణ, గుండా చంద్ర మాణిక్యం,కామెర దుర్గరాజ్ ,సలేంద్ర సత్యనారాయణ,దేవి పోచన్న ,గొనే సత్యం,బియ్యాల ఉపేందర్ ,మిర్యాల రాజ్వేర్ రావు ,అక్కెపల్లి బాపు ,వనం సత్యనారాయణ,మొగిలి లక్ష్మణ్ ,పార్టీ ప్రజాసంఘాల నాయకులు
రేగుంట చంద్రకళ,గట్టు సర్వేశం ,పులి శంకర్, దాగం రాయలింగు ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.