లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై మే 17 వరకు నిషేధం ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాల మేరకు ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కార్మకులు, కూలీలు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లినవారు తమ ప్రాంతాలకు చేరుకోవడం కోసం శ్రామిక్ రైళ్లను మాత్రం నడుపుతామని ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్ కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దని విన్నవించింది. సరుకు రవాణా, పార్సిల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది.