ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతోంది. తాజాగా మరో ఆరు పథకాల పేర్లను మార్చింది. ఈ పథకాలన్నీ పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న పథకాలే. ఆరు పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పేర్లు మారిన పథకాలు ఇవే:
- పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం ‘మన బడి – మన భవిష్యత్’ గా మార్పు
- అమ్మఒడి పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్పు
- గోరుముద్ద పథకం పేరు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు
- జగనన్న ఆణిముత్యాలు పథకానికి ‘అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం’గా నామకరణం
- స్వేచ్ఛ పథకానికి ‘బాలికా రక్ష’గా పేరు మార్పు
- విద్యాకానుక పథకానికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర’గా పేరు మార్పు