- శ్రీవారిపై సంకీర్తనలు ఆలపించిన అన్నమాచార్యులపై ఎందుకింత నిర్లక్ష్యం….
- ప్రశ్నించిన బిజెపి నేతలు..
తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రియ భక్తుడు ఎన్నో సంకీర్తనలు పాడి చరిత్రలో నిలిచిపోయిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతోత్సవాలను అనాధ అన్నమయ్యకు చేసినట్లు నేటి పాలకులు నిర్వహించడం ,
అధీ సాక్షాత్తు “తాళ్లపాక “మన సీఎం జిల్లా కావడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు భాజపానేతలు సామంచి శ్రీనివాస్ , వరప్రసాద్ లతో కలిసి రమేష్ మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జయంతిని అంగరంగ వైభవంగా భక్త కోటికి తెలిసే విధంగా జరిపేవారని గత పాలక వర్గాన్ని కొనియాడారు. అన్నమయ్య జయంతోత్సవాలు మొదలైనా ఇప్పటివరకు తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం లో పెచ్చులు ఊడినా మరమ్మత్తు చేయలేని దుస్థితి ఉందన్నారు. అలాగే చెన్నకేశవ స్వామి ఆలయం లో కూడా గడ్డి తదితర వ్యర్ధాలను వేసి అపరిశుభ్రంగా ఉంచడం బాధాకరమన్నారు. చిన్న స్థాయి ఎల్డిసి , యూడిసి అధికారులతో ఈ ఉత్సవాలను జరపడం ఏంటని ప్రశ్నించారు. తాళ్లపాక ఆలయంలో స్వామివారి వస్త్రాలను మార్చే దోబి కూడా కరువయ్యారన్నారు. శ్రీవారి చిన్న లడ్డులను భక్తులకు భక్తులకు అందించలేని పరిస్థితన్నారు. గతంలో ఓ మాసముందే తాళ్లపాకను టీటీడీ యాజమాన్యం సందర్శించి అందరిని కలుపుకొని కలెక్టర్ స్థాయిలో జయంతోత్సవాలను భారీ స్థాయిలో జరిపే వారని కొనియాడారు. సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత వైకాపా అరాచక దోపిడి పాలనపై నేటి నుండి పది రోజులపాటు ప్రజా క్షేత్రంలో పర్యటిస్తామని , ఈనెల 12వ తేదీ చార్జ్ షీట్ దాఖలు , 16వ తేదీ ఫిర్యాదులు పెద్ద ఎత్తున స్వీకరిస్తామని తెలిపారు. ఇసుక , మద్యం , మటన్ , సినిమాలు తదితర ఎన్నో వాటిపై సాక్షాత్తు సీఎం కే వాటా చేరేలా వైకాపా పాలన కొనసాగిస్తున్నది భారీగా విమర్శించారు