హుకుంపేట,కామయ్య పేట గ్రామాల్లో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మర్రి కామయ్య 64 వ వర్ధంతి వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల క్రిష్ణ రావు వైస్ ఎంపీపీ కొండలరావు లు మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ,గిరిజనుల వెట్టి బానిస విముక్తి కోసం,తన జీవితాన్ని, ఆస్తిని యావత్ దారబోసిన మహోన్నత వ్యక్తి మర్రి కామయ్య అనీ వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కై గిరిజన జాతి మనుగడ కాపాడటం మన కర్తవ్య మై ఉందన్నారు .గిరిజన జాతిని కాపాడటం, వారి హక్కులు చట్టాలు సంపూర్ణంగా అమలుకై పాలకులపై ఉద్యమించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రజల అభివృద్ధి కి వ్యతిరేకంగా పూనుకుంటున్నాయన్నారు ,నూతన అటవీపాలసీ ద్వారా గిరిజనులకు అడవి నుండిదూరం చేస్తున్నారు. జంతులపై ఉన్న ప్రేమ గిరిజన ప్రజలపై లేదని అన్నారు ,టైగర్ జోన్ పేరుతో గిరిజనుల సాగు భూమి లాక్కుంటున్నారని ఆరోపించారు . బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ ల్లో చేర్చడానికి రాష్ట్రంలో ని అధికార వైసీపీ సీఎం జగన్,ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబులు పోటీ పడుతున్నారని వారు తెలియ జేశారు ,బిసి ఏ లో ఉన్న బోయలు రాజకీయంగా,ఆర్థికంగా ,సామాజికంగా బాగా అభివృద్ధి చెందిన వారన్నారు. గిరిజనులకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం బోయ,వాల్మీకి లకు లేదన్నారు. నిజమైన గిరిజనులకు ప్రత్యేక భాష, సాంస్కృతి ఉంటుందని,ఒక్కొక్క గిరిజన తెగకు ఒక భాష మాట్లాడ తారని వారు తెలియజేసా
పెళ్లిళ్లు,పేరంటాలు,దేవుళ్ళు,పండగలు అన్నీ గిరిజనులకు వేరుగా ఉంటాయన్నారు.గిరిజనులు ప్రకృతి ఆరాదికులు వీరికి హిదూ దేవతలతో సంబంధాలే లేదు కానీ వాటిని మత తత్వ బిజెపి రుద్దుతుందాన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మాణం వెనక్కి తీసుకోవాలి అన్నారు తీర్మానానికి ,మద్దతు పలికిన ఏజెన్సీ ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, తీగలవలస మాజీ సర్పంచ్ పల్టాసింగి కామేశ్వర రావు,తడిగిరి వైస్ సర్పంచ్ కిల్లో రామారావు,సీదరి మల్లేష్, శంకర్ రావు, చిరంజీవి,కొండ పల్లి సూరిబాబు, శెట్టి మత్స్యరాజు తదితరులు పాల్గొన్నారు.
