భారత క్రికెట్ జట్టు శ్రీలంక జట్టును 78 పరుగుల తేడాతో ఓడించారు. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగుకు దిగిన భారత జట్టు మొదట్నుంచి బ్యాటింగులో భారీగా స్కోర్ చేసారు . శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ శ్రీలంక బౌలర్లను ఒక ఆట ాడుకున్నారు. గ్రౌండుకు నలువైపులా షాట్లు కొడుతూ ఇద్దరు బ్యాట్స్ మెన్లు వీరవిహారం చేశారు. కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు, శిఖర్ ధావన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి మొదటి వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్లు ఇద్దరు ఔటయ్యాక బ్యాటింగులో మిడిలాడర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ పట్టారు. విరాట్ కొహ్లీ అనవసరంగా రనౌటయ్యాడు. చివర్లో శార్దూల్, మనీష్ పాండేలు రాణించడంతో భారత జట్టు 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. బ్యాటింగుకు దిగిన శ్రీలంక మొదటి ఓవర్లోనే చేతులెత్తేసింది. వరుసగా వికెట్లను పోగొట్టుకుంది. శ్రీలంకలో మాత్రం ధనంజయ డిసిల్వా ఒక్కటే భారత్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు.36 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతనికి మరో బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అంది ఉంటే చివరి వరకూ మ్యాచ్ తెగ ఉత్కంఠంగా సాగేది. కాకపోతే, భారత్ బౌలర్లు వరుసగా వికెట్లను తీసి మ్యాచును పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 78 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించారు. మూడు టీ20ల సీరిస్ను 2-0 తేడాతో భారత్ జట్టు గెలుచుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )