పల్నాడు జిల్లా కారంపూడి: కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో “ది రిపోర్టర్” టీవీ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సిఐ జయకుమార్ మరియు వైసిపి మండల అధ్యక్షులు మేకల శారదా శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిఐ జయకుమార్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. మేకల శారదా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధి పత్రికలు, న్యూస్ ఛానల్స్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయడం లో న్యూస్ ఛానళ్ల పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల వైసిపి నాయకులు, మీడియా మిత్రులు MRR న్యూస్ నాగేశ్వరరావు, అక్షర సాగరం న్యూస్ ఎస్ కే జానీ, బొల్లాపల్లి మండల క్రైమ్ న్యూస్ రిపోర్టర్ యు.వెంకటేశ్వర్లు, “ది రిపోర్టర్” టీవీ రిపోర్టర్ నాగేంద్రబాబు,శ్యామ్ ప్రసాద్, ఆత్కూర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.