ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజు కి కబ్జాదారులు రెచ్చిపోతున్నారు, అది బొందల గడ్డయిన , నీటి కుంటయినా దోచుకోవడమే వారి పని. మనమందరము చివరికి వెళ్ళేది బొందలగడ్డకే అయినా బ్రతికుండగానే మాకు బొందలగడ్డ కావాలని కబ్జా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం “గడ్డ కింద పల్లి” దళిత వాడ కు సంబంధించిన స్మశాన వాటికను అలాగే ఆవులు , మేకలు, గేదలు నీళ్లు త్రాగే కుంటను అధికారుల అందడలతో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కబ్జాకు పాలుపడుతున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. సర్వే నెంబర్ 134/3 లో గల పుల్ల గుంటను , దళితులకు సంబంధించిన స్మశానవాటికను అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారుల పై అలాగే సహకరించిన అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
