- శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వారి పెట్రోల్ బంకు నిర్మాణం
- ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు – నిలిపివేసిన తహశీల్దార్
పల్నాడు జిల్లా కారంపూడి: మండలంలోని శంకరాపురం సిద్దాయి రెవిన్యూ గ్రామ పరిధిలో ఉన్న కాచవరం పంచాయతీ నందు సర్వే నెంబర్ 870-1A1 లో సుమారు 0.77 సెంట్ల భూమి నందు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పెట్రోల్ బంక్ అవుట్లెట్ నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీ సిమెంట్ యాజమాన్యం చేపట్టిన పెట్రోల్ బంక్ అవుట్లెట్లో మండల సర్వేయర్ ఖాన్, గాదేవారిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి పసుపులేటి సైదులు విచారణ జరపగా నిర్మాణం నందు కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించి తాహశీల్దార్ కు నివేదిక అందించారు. ప్రభుత్వ అనుమతి పొందకుండా నిర్మాణం చేపట్టడం, అందులోనూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మించడం చట్టరిత్య నేరమన్నారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించామని తాహశీల్దార్ జి. శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.