- ఏడాదిగా రాకొండలో కనిపించని ఇసుక మాఫియా
- ఇసుక మాఫీయాపై ఎస్పీ ఉక్కుపాదం
- ఎస్పీ వెంకటేశ్వర్లుకు రుణపడివుంటాం
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకుండ గ్రామ శివారులో గల ఊకచెట్టు వాగులో ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టి, ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకొని నేటితో ఏడాది పూర్తవుతుందని, ఇసుక మాఫియాపై నిరంతరం నిఘా పెట్టి ఉక్కుపాదం మోపిన నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కృషి మరువలేనిదని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం నేనుసైతం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకుండలో రెచ్చిపోయిన ఇసుక మాఫియాను అరికట్టాలని గత ఏడాది ఫిబ్రవరి 14న జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లుకు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
దీనిపై స్పందించిన ఎస్పీ ఇసుక అక్రమ రవాణా అరికడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలోనే తమ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎస్పీ,15 ఫిబ్రవరి 2022న ఆకస్మికంగా మరికల్ మండలం రాకొండ గ్రామాన్ని సందర్శించి అక్కడున్నటువంటి ఇసుక రీచ్ లను, నిబంధనలు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. ఎస్పీ ఆకస్మిక పర్యటనలో రాకొండ గ్రామంతో పాటు శివారులో గల ఊకచెట్టు వాగు నుండి పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఎస్పీకి దర్శనం ఇచ్చాయి. దీంతో ఆగ్రహించిన ఎస్పీ వెంకటేశ్వర్లు ఈ అక్రమ ఇసుక రవాణా అని అరికట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించారు అంతేకాకుండా మరికల్ పోలీస్ స్టేషన్ చేరుకొని మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసి ఇకపై ఇసుక అక్రమ రవాణా కొనసాగించే ప్రసక్తే లేదని ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ఆ వాహనాలను కోర్టులో జప్తు చేస్తామని అప్పట్లో ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడంతో రాకొండలో ఇసుక మాఫియా ఆగడాలు చెక్ పడింది. దీంతో ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు నేనుసైతం చేసిన పోరాటం ఫలించింది. గత 12 ఏళ్లుగా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పోరాటం చేస్తున్న తాము ఎన్నో విలువైన ఇసుక రీచ్ లను కాపాడడం జరిగిందని, కోట్లాది రూపాయల విలువైన ప్రజా సంపాదన లూటీ కాకుండా పరిరక్షించామని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుకు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వనికి, పోలీసలకు సవాల్ విసిరిన ఇసుక మాఫియాను రాకొండ నుంచి తరిమికొట్టిన నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుకు ఋణపడి వుంటాంమని ప్రవీణ్ తెలిపారు.
అంతేకాకుండా వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపుర్ మండలం అంతాయపల్లి శివారులో గల వాగునుండి ఇటీవల కాలంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్చగా కొనసాగుతుందన్నారు. అంతాయపల్లిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గత డిసెంబర్ 16న పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు. దీంతో అక్కడ కూడా దాదాపు రోజుకు 200లకు పైగా భారత్ బెంజ్ లతో తరలించే ఇసుక అక్రమ రవాణా అరికట్టడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయల ప్రజా సంపదను, ప్రజా ధనాన్ని లూటీ కాకుండా కాపాడగలిగామని ప్రవీణ్ తెలిపారు.
మళ్లీ గత మూడు రోజుల క్రితం అంతయపల్లిలో ఇసుకను అక్రమ రవాణా చేసేందుకు ఇసుక మాఫియా ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ నేపథ్యంలోని 210 హిటాచి మిషన్ ను అంతాయపల్లి వాగు కట్టపై తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. అంతయాపల్లి
ఇసుక అక్రమ రవాణా చేసేందుకు మళ్లీ చేస్తున్నటువంటి కుట్రాలను సాగనిచ్చే ప్రసక్తి లేదని, ఇసుక మాఫియాను రాకొండలో ఎలాగైతే అరికట్టడం జరిగిందో, అంతాయపల్లిలో కూడా ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకునే అంతవరకు నేనుసైతం స్వచ్ఛంద సంస్థ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోని గత డిసెంబర్ 16న వనపర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఇసుక మాఫియాపై సాక్షాదారులతో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకునే వరకు, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు నేనుసైతం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.