30కి మించి ఫొటోలు పంపించలేక.. కొన్ని కొన్ని చొప్పున ఒకటికి నాలుగు సార్లు పంపిస్తూ యూజర్లు పడే ఇబ్బందిని వాట్సాప్ అర్థం చేసుకున్నట్టుంది. అందుకే ఈ ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా మార్చింది. ఒకే విడత 100కు పైగా ఫొటోలు, వీడియోలు పంపుకునేందుకు కెపాసిటీని పెంచింది. గతంలో వీడియోలు అయినా, ఫొటోలు అయినా 30కి మించి పంపడానికి వీలయ్యేది కాదు. ఇక మీదట ఈ ఇబ్బంది ఉండదు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ అప్ డేటెడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ కు వెళ్లి వాట్సాప్ అప్లికేషన్ ను అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇతరులకు పంపించే డాక్యుమెంట్లకు సైతం క్యాప్షన్ పెట్టుకునే ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలను పంపించే సమయంలోనే క్యాప్షన్ అడుగుతుండేది. ఇకపై డాక్యుమెంట్లను పంపిస్తున్నా క్యాప్షన్ అడుగుతుంది. కావాలంటే క్యాప్షన్ టైప్ చేసి, లేదా క్యాప్షన్ ఇవ్వకుండానే సెండ్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు.