పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాధా బయలుదేరారు. మార్గమధ్యంలో పిడిగురాళ్లకు చేరుకున్న వంగవీటి రాధాకకు సౌజన్య హాస్పిటల్ డాక్టర్ కృష్ణంశెట్టి శ్రీధర్ ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున వంగవీటి రాధా అభిమానులు పిడుగురాళ్లకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. రాధ రాకతో అభిమానులతో పిడుగురాళ్ల దద్దరిల్లింది. పిడుగురాళ్లలో రంగా విగ్రహానికి పూలమాల వేసి భారీ ర్యాలీతో పల్లెగుంతకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో సౌజన్య హాస్పిటల్ డాక్టర్ కృష్ణం శెట్టి శ్రీధర్, కామిశెట్టి రమేష్, బసవల్ల ఆజాద్, బేతంచర్ల కొండా మేస్త్రి, కామిశెట్టి అమరలింగేశ్వర రావు, చిందుకూరి నాగేంద్ర, గుర్రం కోటి బ్రదర్స్, నంబూరు శ్రీను, బిట్రగుంట రమేష్, పసిలేటి నరసింహారావు, కొమిరిశెట్టి సతీష్, బేతంచర్ల నాగేశ్వరరావు, ఆవుల రమేష్, నాగమల్లేశ్వరరావు, అంబటి సాయి, బేతంచర్ల యుగంధర్ మొదలగువారు పాల్గొన్నారు