పల్నాడు జిల్లా మండల కేంద్రమైన పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్ లో గల సిరి ప్లాజా నందు సోమవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లలిత కుమారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి లలితాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా కామిరెడ్డి లలితాదేవి మాట్లాడుతూ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ చేతన ఆశయ సాధన కోసం కృషి చేస్తుందన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించుటకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తుందన్నారు. సమాచార హక్కు చట్టం, భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఆర్టికల్ 73- 74 రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డు సభలలో ప్రజల పాత్ర పెరిగేలా, వారికి అవగాహన కల్పిస్తుందన్నారు. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా పనిచేసే ఈ చట్టాన్ని పౌరులు అంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం, విద్యాహక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అన్నారు. మార్చి నెల మొదటి వారంలో పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు తో పాటు, సమాచార హక్కు చట్టంపై ఒక్కరోజు అధ్యయన శిక్షణా
తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వై. మధుసూదనరావు, షేక్ కరీముల్ల, అక్కినపల్లి, బాలయ్య, జి. రాజేష్, కె.రమేష్ బాబు, షేక్ దస్తగిరి, జి. శంకరరావు, టి.సురేష్, కె. క్రాంతి కుమార్, యు. వెంకటేశ్వర్లు, వి. అనిల్, సి.హెచ్. ప్రసాద్, ఎం. వెంకటేశ్వరరావు, నీలాద్రి రాంబాబు, కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.