దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ (AP) లో 7 స్థానాలకు, తెలంగాణ (Telangana)లో 3 మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలో నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఏపీలో నారా లోకేశ్, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్య నారాయణ పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవనున్న ఈ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలు..
- నోటిఫికేషన్ : మార్చి 6
- నామినేషన్ల స్వీకరణ : మార్చి 13 వరకు
- నామినేషన్ల పరిశీలన : మార్చి 14
- పోలింగ్, కౌంటింగ్ : మార్చి 23