contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేవంత్ రెడ్డి యాత్రను విజయవంతం చేయాలి : కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం: కరీంనగర్ జిల్లాలో ఏటి నుంచి ప్రారంభమై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రం గన్నేరువరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లోని ఇల్లందకుంట నుంచి పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల మూడో తేదీన మానకొండూరు నియోజకవర్గం లోని పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి గ్రామంలో యాత్ర కొనసాగుతుందని సాయంత్రం మండల కేంద్రం మానకొండూరులో జనసభ ఉంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు, ఈ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిట్కూరి అనంతరెడ్డి, దేశరాజు అనిల్, పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :