కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్సై మామిడాల సురేందర్ తో పాటు షీ టీమ్ వారితో విద్యార్థిని విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు చిన్న పిల్లలపై లైంగిక నేరాలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు, షీ టీమ్స్ మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. విపత్కర పరిస్థితిలో డయల్ 100 ని ఉపయోగించుకోవాలని, సైబర్ నేరాలు జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా అధికారుల ఫోన్ నెంబర్లు కలిగినటువంటి ఫ్లెక్సీని స్కూల్లో అంటించడం జరిగినది.ఈ కార్యక్రమంలో షీ టీం ఏఎస్సై విజయమని, హెచ్ సి పర్శరామలు, డబ్ల్యూ పిసి స్వప్న మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.