హైదరాబాద్ : ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి మరణిస్తున్న ఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ లో ఇలాంటి విషాద ఘటన మరోటి జరిగింది. లాలాపేటలో పరమేష్ యాదవ్(38) అనే వ్యక్తి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లోనే ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ఇలానే గుండె పోటుతో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాలో 19 ఏళ్ల కుర్రాడు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. దాంతో, సడెన్ హార్ట్ ఎటాక్స్పై రాష్ట్రంలో ఆందోళన మొదలైంది.
Another #SuddenDeath in #Hyderabad: 38-year-old Shyam Yadav collapsed while playing badminton in Prof Jayshankar Indoor Stadium, Lalapet #Secunderabad brother says he was a private employee, sportsperson, played cricket, badminton, everyday after return from work @NtvTeluguLive pic.twitter.com/0iXrK6N8Jf
— Syed Mahammed Rafi (@JournalistRafi) March 1, 2023