కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం విద్యాశాఖ అధికారి సిహెచ్ జనార్దన్ రావు సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షలకు ఎలా సంసిద్ధులు అవుతున్నారు వారి పాఠశాల నుండి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం పరిచారు. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు సెక్టోరియల్ ఆఫీసర్ కర్ర అశోక్ రెడ్డి. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దేవవరం సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.