కరీంనగర్ జిల్లా : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో బిజెపి రాజ్యసభ సభ్యులు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బిజెపి జాతీయ నాయకులు పొల్సాని సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు మరియు కమ్మర్ ఖాన్ పేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మరియు పెద్దపల్లి ఎక్స్ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో హిందూ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పి సుజాత రెడ్డి,మాజీ జిల్లా అధ్యక్షులు అర్జున్ రావు, పెద్దపెల్లి జిల్లా మాజీ అధ్యక్షులు లింగయ్య, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నం అంజయ్య, బిజెపి సీనియర్ నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ ,బిజెపి రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి, యువమోర్చా మాజీ అధ్యక్షులు గంటల రమణారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
