ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం లోని మేళ్ళవాగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గత 30 సంవత్సరాలుగా పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కానీ నేటికీ సాధ్యం కాలేదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు వంగవరపు శ్యాంప్రసాద్ దృష్టికి రావడంతో బొల్లాపల్లి మండలంలోని గ్రామాలను సందర్శించినప్పుడు మండల కేంద్రం విషయంలో గ్రామస్తులు పడుతున్న బాధలను తెలుసుకొని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం లో ఇంచుమించు 57గ్రామాలు, 28 గ్రామ పంచాయతీలు గలవని, ప్రతి గ్రామం నుండి ప్రజలు పనుల నిమిత్తము ఎమ్మార్వో ఆఫీస్ కి గాని , ఎండివో ఆఫీస్ కి గాని , పోలీస్ స్టేషన్ కు గాని వెళ్ళాలంటే బస్సు సౌకర్యం, రోడ్డు సౌకర్యం సరిగా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్తున్నారు. కావున ప్రజల యొక్క విన్నపం ఏమిటంటే బొల్లాపల్లి మండలం లో మేళ్ళవాగు గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను కలిపి మండల కేంద్రముగా చేసినట్లయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. అంతేకాక వినుకొండ హైదరాబాదు కు వెళ్ళే ప్రధాన రహదారి మేళ్ళవాగులో గ్రామం మీదుగానే ఉండడం వలన ప్రజలకు వాహన సదుపాయాల సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. మండల గ్రామస్తులు బొల్లాపల్లి వెళ్లాలంటే సరైన వాహన సదుపాయాలు లేక సాయంత్రం 5 గం.లు దాటితే అటవీ ప్రాంతంగుండా ప్రజలు ప్రయాణంచేయాలంటే సదుపాయాలు లేక కొన్ని సమయాలలో నడిచి అడవిగుండా వెళ్ళవలసి వచ్చేది.
కావున మేళ్ళవాగు బస్టాండ్ సెంటర్లోని గవర్నమెంట్ స్థలాన్ని మరియు ఫారెస్ట్ బంగ్లా స్థలాలు, గత వాటర్ ట్యాంక్ యొక్క స్థలాలను వినియోగించుకొని కొత్త మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లతే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఈ విషయం పై త్వరలో సియం జగన్మోహన్ రెడ్డి కి వినతిని అందిస్తానని అలాగే వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అలాగే పల్నాడు జిల్లా ఇంచార్జి మరియు మాచర్ల శాసనసభ్యులు పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి రెడ్డి ని కలిసి వారికి వినతిపత్రం ఇచ్చి చర్చిస్తానని అన్నారు. మేళ్ళవాగు మండల కేంద్రంగా ప్రకటించాలని చుట్టపక్కల ప్రాంత ప్రజల యొక్క విన్నపము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేస్తామని శ్యాంప్రసాద్ తెలిపారు.