కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం :ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తోనే నూతనంగా ఏర్పడిన గన్నేరువరం మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని మాదాపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గృహలక్ష్మి, దళిత బంధు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకంలో మానకొండూరు నియోజకవర్గానికి 200 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. పేద ప్రజలకు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాది ముబారక్ దళిత బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జెడ్పిటిసిలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
