చిలకలూరిపేట వైపు నుండి గ్రానైటు ను మాచెర్ల మీదగా ఏ విధమైన బిల్లులు లేకుండా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు నిన్న గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారులు మాచెర్ల రైల్వే గేటు వద్ద నిఘా వేసి గ్రానైట్ లోడుతో వెళుతున్న ఏడు లారీలను ఆపి తనిఖీ చేయగా . ఈ తనిఖీలలో మైనింగ్ ట్రాన్సిట్ పాసులు మరియు e-way బిల్లులు లేకుండా ఆరు లారీలలో బ్లాక్ గ్రానైట్ఎం, ఒక లారీలో కలర్ గ్రానైట్ రవాణా చేస్తున్నట్టు తేలింది. చిలకలూరిపేట, మార్టూరు మండలాల నుండి హైదరాబాద్, మహారాష్ట్ర, కర్నాటక లోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లుగా సమాచారం. ఏడూ లారీలను గ్రానైటు తో సహా అదుపులోకి తీసుకున్నారు. పై తనిఖీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ శ్రీ సి.హెచ్. శ్రీనివాస రావు, ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్. ప్రసాద్ పాల్గొన్నారు.