మంచిరియల్ జిల్లా : బెల్లంపల్లి పట్టణంలోని కాలెక్స్ ఏరియాకు చెందిన రాపెల్లి శివకృష్ణ (18) ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బెల్లంపల్లి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం గురువారం జరిగిన ఇంటర్ పరీక్ష సమయంలో కడుపు నొప్పితో పరీక్షా సరిగా రాయలేదని మనస్తాపంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకో ఎంతో చురుకుగా ఉన్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండడంతో అక్కడ వారి హృదయాలను కలచివేసింది