contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐకెపి వివోఏల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నశించాలి: CITU

  • ఐకెపి వివోఏల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నశించాలి.
  • కనీస వేతనం చెల్లించాలి.
  • గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి.
  • సమ్మెకు సంఘీభావం తెలిపిన పైళ్ళ ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు..
  • 3వ రోజు సమ్మె అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేశారు :దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి..

మంచిర్యాల జిల్లా: తెలంగాణ ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం(CITU) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మూడవరోజు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద సమ్మె చేసి అనంతరం ఐబీ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి. మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సం,రాలు గా విఓఏలుగా సెర్ప్ ఐకెపి లో పని చేసినప్పటికీ ప్రభుత్వం కేవలం నెలకు 3900/- రూ,వేతనం ఇస్తున్నది. పెరిగిన ధరలకు ఈ వేతనం సరిపోవడం లేదు.శ్రమ దోపిడీ చేస్తున్నది.ఈ ప్రభుత్వం మహిళలని,ఆర్థికంగా అభివృద్ధిలో తీసుకోరావడం లో కీలక పాత్ర పోషించే విఓఏ లకు సరైన న్యాయం జరగడం లేదు.సమావేశాలు పే బ్యాంక్ లోనూ స్ట్రినిధి లోన్స్ ఇప్పిoచి రికవరీ చేయించడంలో 100 శాతం, విఓఏల ముఖ్య పాత్ర పోషిస్తున్న కానీ పెరు లేకుండా పోతుంది.వెట్టి చాకిరి చేయిస్తున్నారు.ప్రభుత్వ పథకాలు మహిళలకి అందరికీ తీసుకోనివెళ్తున్నాం.ప్రభుత్వం చెప్పే పనులు వంద రకాలుగా చేస్తున్నాం.కానీ బంగారు తెలంగాణ రాష్టంలో భాధలు పడుతున్నాం. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం. ఐకెపి విఓఏ ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం..? అదే విదంగా కుంటాల కుమార్ ఐకేపీ విఓఏ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…. ప్రభుత్వం పింఛన్ ఇచ్చేవిదంగ రూ, 3900/- ఇస్తున్నారు.ఇది సరైనది కాదు. అర్హులైన పేద వివోఏలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ప్రతి మహిళలకు ప్రభుత్వం ఉచితంగా స్కూటీలు సరఫరా చేయాలి.

డిమాండ్స్:-

1) ఉద్యోగ భద్రత సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి.
2) సాధారణ భీమా పది లక్షలు ,ఆరోగ్య భీమా ఐడి కార్డ్ ఇవ్వాలి.
3) విఓఏ లతో ఆన్లైన్ పనులు చేయించ రాదు.
4) అర్హతలు ఉన్న విఓఏ నీ సీసీ లు గా ప్రమోషన్ ఇవ్వాలి.

5) గ్రేడింగ్ విధానం రద్దు చెయ్యాలి 58 జీవో మార్చాలి.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్, జుమ్మిడి లక్ష్మణ్, రాము జిల్లా కోశాధికారి, తుకారాం జిల్లా ఉపాధ్యక్షులు, శారదా, అనిత,శ్వేత, రజిత, అనంత లక్షి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :