- నిరుద్యోగుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మానకొండూరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై దోషులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులంతా బుద్ది చెప్పాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు.గతంలో నిర్వహించిన అనేక పరీక్షల్లో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యానికి పనితీరుకు నిదర్శనమన్నారు. గతంలో ఇంటర్ బోర్డు పరీక్షల్లో జరిగిన తప్పుల వల్ల కూడా 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఎంసెట్ పరీక్ష పేపర్ లీకు చేసిన దోషులను కూడా ఇప్పటివరకు శిక్షించలేదని, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి పరీక్షల పేపర్ లీకు చేస్తూ నిరుద్యోగ యువతను కెసిఆర్ సర్కార్ మోసం చేస్తుందన్నారు. టిఎస్పిఎస్సి బోర్డు యాజమాన్యంపై , పేపర్ లీకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, నిరుద్యోగులు అందరికీ న్యాయం చేయాలని , సంబంధిత ఐటి మంత్రి కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి అలాగే పరీక్ష వ్రాసిన వాళ్ళకు ఒక్కోక్కరికి లక్ష రుపాయల పరిహారం చెల్లించాలని మానకొండూర్ నియోజకవర్గ బిజెపి పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి,కిసాన్ మోర్చా సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు కొలిపాక రాజు,నియోజకవర్గ నాయకులు సొల్లు అజయ్ వర్మ ,కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి,బొంతల కళ్యాణ్ చంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్,బూట్ల శ్రీనివాస్ ,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మియ్యాపురం లక్ష్మణాచారి,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,పకిడె మహెందర్,రేపాక ఎంపీటీసీ సుమలత – మల్లేశం, రాపాక ప్రవీణ్,ఏనుగుల అనిల్ ,దోనె అశోక్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేష్ , వంగల ఆంజనేయులు, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మొలంగూరు నరేందర్, దొంతరవేణి శ్రీనివాస్,సంగ రవి,సత్యం,గాదె వెంకన్న,మీస అర్జున్,గైని రాజు గౌడ్,రాజ్ కుమార్,శ్రీహరి ,సారయ్య తదితరులు పాల్గొన్నారు.