కరీంనగర్ జిల్లా : అడగకుండానే వరాలను ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెర్ఫ్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసిన మాదిరిగానే ఉపాధి హామీలో పని చేస్తున్న సిబ్బందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల కోశాధికారి హన్మాండ్ల యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు సంవత్సరాల క్రితం సమ్మెకు వెళ్లగా రెండు సంవత్సరాల జీతంతో పాటు 33% పిఆర్సి కూడా కోల్పోయామని చాలీచాలని జీతాలతో పూట గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారందరికీ పే స్కేల్ వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.