మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఏసీపీ తిరుపతి రెడ్డి లతో కలిసి సందర్శించారు.. ఈ సందర్బంగా సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లను సందర్శించి పోలీసు స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని దానిలో భాగంగా మంళవారం దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ అనేది చాల చారిత్మక పొలీసు స్టేషన్ ప్రాంతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పొలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతంలో ప్రజల కోసం కమ్యూనిటి కనక్ట్ కార్యక్రమాలను నిర్వహించాలనిమారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతాలను తిరిగి, “గ్రామ పొలీసు” అధికారి వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రజల కోసం పోలీస్ తరుపున చేసే ప్రతి కార్యక్రమం లో ఈ ప్రాంతంలోని ప్రజల సహకారం ఉండాలి తెలిపారు. కార్యక్రమం లో లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి ఎస్ఐ దండేపల్లి సాంబ మూర్తి ఎస్ఐ జన్నారం సతీష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.