సంగారెడ్డి : రాజకీయ కక్ష తోటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు ఎంపీ
రాహుల్ గాంధీ పై పార్లమెంట్ లో వేసిన అనర్హత వేటును తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీపిసిసి రాష్త్ర ప్రతినిధి ఆంజనేయులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో చీకటి దినమని,భారత ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చన్నారు.
దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ చేపట్టిన యాత్రకు మంచి స్పందన రావడంతో కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదన్నారు. రూ.లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అదానీ సంస్థలకు మోదీ ఎలా దోచి పెట్టారో రాహుల్ గాంధీ ప్రజలకు వివరించారన్నారు. దీనిపై ప్రశ్నించినందుకే కేంద్ర పాలకులు ఆయనపై పగపట్టి లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు. బిజెపికి చెందిన నేతలు రాహుల్ గాంధీ పై ఎన్ని వ్యాఖ్యలు చేసిన పట్టించుకోలేదని నాయకుడు అంటే ప్రజలకు మేలు చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని అన్నారు. దేశం మొత్తంగా రాహుల్ గాంధీ పై మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని ప్రజలతో పాటు విపక్షాల నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారని ఇది శుభ పరిణామం అన్నారు. రాహుల్ గాంధీని కాపాడుకునేందుకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు నడుంబిగించాలన్నారు. మోదీ, కేసీఆర్ ప్రజావ్యతిరేకవిధానాలను అవలంభిస్తున్నారన్నారు. వారి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ య పి పి జ్యోతి సురేష్ నాయక్ నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిజ్వాన్ కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లేశం శివంపేట్ మండల్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ నర్సాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా ఎంపీటీసీలు అశోక్ నర్సాపూర్ మండలం ఉపసర్పంచలపురం అధ్యక్షులు అశోక్ గౌడ్ హత్నూర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సాపూర్ మైనార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మత్ నర్సాపూర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వాసిం భాయ్ కృష్ణ కొల్చారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు కౌడిపల్లి యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధన్సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం యాదవ్ రషీద్ రాధాకిషన్ గౌడ్ పాషా భాయ్ కౌడిపల్లి మండల్ కాంగ్రెస్ నాయకులు రమేష్ గుర్రాల నాగేష్ కళాలి అనిల్ గౌడ్ మహేందర్ యాదవ్ సుధాకర తదితరులు పాల్గొన్నారు.