- అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోని, తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్న ఆ ప్రాంత ప్రజలు.
వినుకొండ:- మండలం తిమ్మాయిపాలెం రోడ్డు లో శుక్రవారం సాయంత్రం క్వారీ లో బ్లాస్టింగ్ జరిగి ఇరువురు మృతి, మరో ఇద్దరుకూలీలకు తీవ్ర గాయాలుకావడంతో… ఈ రోజు ఆ యా ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్న ఐదు క్వారీ లను పరిశీలించిన మైనింగ్ అధికారులు. తిమ్మాయిపాలెం రోడ్డు లోని రెండు, వెల్లటూరు రోడ్డులోని గిరి ప్రదక్షిణ రోడ్డు సమీపంలోని మరోక క్వారీ కి చెందిన వారు బ్లాస్టింగ్ అధికంగా నిర్వహిస్తున్నారని బ్లాస్టింగ్ దాటికీ కొండరాళ్లు వచ్చి పడుతున్నాయని సమిపంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్ధానిక ప్రజలు తెలిపారు.బ్లాస్టింగ్ చేయడానికి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని… అక్రమ బ్లాస్టింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోని తమ ప్రాణాలను కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు అధికారులను కోరుతున్నారు.