సంగారెడ్డి : ఏకే 47 గన్ ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ పైరై ఏ ఆర్ కానిస్టేబుల్ కు గాయమైన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . పట్టణంలోని విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఏకే 47 గన్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ఫైర్ అయింది. దీంతో రాజశేఖర్ భుజానికి కాయం కాగా వెంటనే తోటి సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాదులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీస్ అధికారులు తెలిపారు.
