కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో టాటా ఏసీ గూడ్స్ దగ్ధమైంది. మండల కేంద్రానికి చెందిన దొగ్గల ప్రదీప్ తన వాహనాన్ని ఇంటి ముందు పెట్టాడు. ఆ వాహనం మంటల్లో దగ్ధం అవుతుండగా ఇంటి పక్కన స్థానికులు చూసి వాహనదారునికి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికులు కుటుంబ సభ్యులు మంటల్ని వాటర్ పంపుతో చల్లి ఆర్పి వేశారు. సంఘటన స్థలంలో డీజిల్ తో ఉన్న వాటర్ బాటిల్ అక్కడే పడేసి ఉండటంతో సంఘటనపై పలువురిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. టాటా ఏసీ గూడ్స్ లో మినరల్ వాటర్ డబ్బా దగ్ధమైంది. తెలిసినవారే ఈ ఘాతకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వాహనదారుడు ప్రదీప్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓకే నెలలో రెండు టాటా ఏసీ వాహనాలు దగ్ధం కావడంతో మండల కేంద్రంలో పలువురు వాహనాదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.