contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి: కలెక్టర్ డాక్టర్ శరత్

  • సకాలంలో చార్జ్ షీట్ దాఖలు చేయాలి..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి:  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు.

కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ రమణ కుమార్, అందోల్ శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై డివిజన్ల వారీగా సమీక్షించారు.

బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు.

బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లకు అందిస్తున్న వివిధ
ఆర్థిక మద్దతు
పథకాల ను వినియోగించుకునేలా, అదే విధంగా ఆయా పథకాలలో లబ్ధి పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించాలని విజిలెన్స్ కమిటీ సభ్యులకు సూచించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 2022-23 సంవత్సరం 28 కేసులలో బాధితులకు రూ.43.50 లక్షలు మంజూరు చేసి చెల్లించినట్లు తెలిపారు.

కమిటీ సభ్యులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురా వాలన్నారు.

ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించేలా చూడాలని రెవెన్యూ డివిజనల్ అధికారులకు సూచించారు.

ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీస్ శాఖ తరపున బాధితులకు తప్పని సరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

మహనీయుల విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా అన్ని విధాలా సహకరించాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో లాంగ్ పెండింగ్ కేసులు ఏవీ లేవన్నారు. 2020,2021 సంవత్సరాలకు సంబంధించి ఒక్కటి చొప్పున,2022 కు 18,
2023 సంవత్సరానికి సంబంధించి 13 మొత్తం 33 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ,ఎస్టీలపై అఘాయిత్యాలు అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో దూషించడం, దూరం పెట్టడం, రెండు గ్లాసుల పద్ధతి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సంఘటనలు పూర్తిగా తగ్గాయన్నారు. సమాజంలో దళితుల్లో చైతన్యం వచ్చిందని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరింత చైతన్య పరచాలని కోరారు.

నిజమైన బాధితుడికి న్యాయం జరగాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.

అధికారులు సమర్దవంతంగా పనిచేస్తున్నారని కితాబు నిచ్చారు.

దళిత బంధు పథకంలో లబ్ధి దారులు తీసుకున్న యూనిట్లతో అభివృద్ధి చెందుతున్నది, లేనిది పరిశీలించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇంచార్జి అధికారి జగదీష్,
డిఎస్పీలు, ఆర్డీవోలు,
డీ టీ డబ్ల్యు ఓ ఫిరంగి, కలెక్టరేట్ సూపరింటెండెంట్, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కె.ఇమ్మయ్య, బి.రామకృష్ణ, పి.దుర్గాప్రసాద్, ఎం.చంద్రశేఖర్, రాథోడ్ నరసింహులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నపూర్ణ, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :