నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులకు నిర్మాణరంగానికి సంబంధించిన కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మెప్మ పీడి గీత నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్మాణ రంగానికి సంబంధించి మూడు నెలల పాటు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ వృత్తిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇట్టి శిక్షణకు 18 సంవత్సరాలు పైబడి 33 సంవత్సరాల లోపు వయస్కులు, పదవ తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన వారు అర్హులన్నారు.
శిక్షణ సమయంలో యూనిఫామ్, షూ, హెల్మెట్, స్టేషనరీ ఉచితంగా ఇస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం న్యాక్ (NAC) సర్టిఫికెట్ ఇస్తారని, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చూపిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.
శిక్షణ పొందుటకు ఆసక్తి,అర్హత గల అభ్యర్తులు తమ విద్యార్హతలు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోల తో సంగారెడ్డి లోని ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్, హాస్టల్ బిల్డింగ్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్,( న్యా క్) కార్యాలయంలో నేరుగా గాని, 9676141583, 9949751056 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.