పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పట్టణం మీదగా భారీ వాహనాల రాకపోకలను ఏప్రిల్ 14 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని శనివారం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి ఆఖరి నాటికి బైపాస్ పనులను పూర్తి చేసి వాహనాలను మళ్లించేలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థతో చెప్పడం జరిగిందన్నారు. ఏప్రిల్ 14 తర్వాత బైపాస్ మీదుగా వాహనాలు వెళ్లాల్సిందేనని పట్టణం మీదగా అనుమతించబోమని ఆయన తెలిపారు.
